బాలీవుడ్‌కి SAMANTHA ఫీవర్... ‘ఊ అంటావా’ అంటూ ఊగిపోతోన్న సెలబ్స్!

ABN , First Publish Date - 2022-01-23T23:41:46+05:30 IST

‘పుష్ప’ సినిమా కరోనా కష్ట కాలంలోనూ కాసులు కురిపించింది. బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే, తెలుగుతో పాటూ హిందీలోనూ ‘పుష్ప’ జోరు ఫుల్లుగా కొనసాగింది. అల్లు అర్జున్ స్టారర్ సూపర్ హిట్ అవ్వటమే కాక మ్యూజికల్‌గా కూడా దుమ్ము రేపుతోంది. దేవి శ్రీ ట్యూన్ చేసిన సాంగ్స్ దేశమంతటా వినిపిస్తున్నాయి. అయితే, ‘పుష్ప’ మేనియా మామూలు జనాలకే కాదు బీ-టౌన్ సెలబ్స్‌కి కూడా సోకేసింది...

బాలీవుడ్‌కి SAMANTHA ఫీవర్... ‘ఊ అంటావా’ అంటూ ఊగిపోతోన్న సెలబ్స్!

‘పుష్ప’ సినిమా కరోనా కష్ట కాలంలోనూ కాసులు కురిపించింది. బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే, తెలుగుతో పాటూ హిందీలోనూ ‘పుష్ప’ జోరు ఫుల్లుగా కొనసాగింది. అల్లు అర్జున్ స్టారర్ సూపర్ హిట్ అవ్వటమే కాక మ్యూజికల్‌గా కూడా దుమ్ము రేపుతోంది. దేవి శ్రీ ట్యూన్ చేసిన సాంగ్స్ దేశమంతటా వినిపిస్తున్నాయి. అయితే, ‘పుష్ప’ మేనియా మామూలు జనాలకే కాదు బీ-టౌన్ సెలబ్స్‌కి కూడా సోకేసింది... 


‘పుష్ప’లోని పాటలన్నీ పాప్యులర్ అయినా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా’ ఇంకా ఎక్కువగా సెన్సేషన్ అవుతోంది. బాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు ఈ పాటపై మక్కువని ప్రకటించారు. ‘ఊ అంటావా’ హిందీ వర్షన్ ‘ఊ బోలెగా’ గీతాన్ని ఆలపించిన కనికా కపూర్ ‘క్యూట్’ అంటూ రీసెంట్‌గా వ్యాఖ్యానించింది. ఎప్పుడూ ఆడవాళ్ల మీద పాటలు రాస్తుంటారు కానీ... ఇలా మగవాళ్ల పై సాంగ్ ప్లాన్ చేయటం ‘భలే’గా ఉందని ఆమె అభిప్రాయపడింది.


కనికా కపూర్ లాగే బాలీవుడ్‌లో బాగా క్రేజ్ ఉన్న మరో టాలెంటెడ్ సింగర్ నేహా కక్కర్. ఈమె కూడా ‘పుష్ప’కు ఫిదా అయిపోయింది. సినిమా, నటీనటుల నటన, అన్నీ బావున్నాయని మెచ్చకున్న స్టార్ సింగర్ ప్రత్యేకంగా మ్యూజిక్ సూపర్బ్ అంటూ కితాబునిచ్చింది. ‘‘నా అభినందన తెలియజేయడానికి నేను చేయగలిగే కనీసమైన పని ఇదం’’టూ నేహా సముద్ర తీరాన సమంత స్టెప్పులేసింది! ఇసుకలో వయ్యారాలుపోతూ ‘ఊ అంటావా’ అని లిప్ సింక్ చేసింది!


నేహ కక్కర్ మాత్రమే కాదు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఊ అంటావా’ పాటపై మనసు పారేసుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్వీ జావేద్ సైతం ఈ మధ్య ‘ఊ అంటావా’ అని కుర్రాళ్లని రెచ్చగొట్టింది. హాట్ కాస్ట్యూమ్స్‌ ధరించి సమంత ఐటెం సాంగ్‌కి ఊగిపోయింది. అంతే కాదు, ‘‘నేను డ్యాన్సర్‌ని కానం’’ గమనిక కూడా ఇచ్చింది!

Updated Date - 2022-01-23T23:41:46+05:30 IST