సమంత నా సోదరి... నాగచైతన్యకు తెలుసు!

ABN , First Publish Date - 2021-10-12T06:26:21+05:30 IST

స్టయిలిస్ట్‌ ప్రీతమ్‌ జుకాల్కర్‌తో సమంతకు ఎఫైర్‌ ఉందని సోషల్‌, వెబ్‌ మీడియాలో విసృతంగా వదంతులు వినిపించాయి. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోవడానికి అతడే కారణమన్నారు. దాంతో ప్రీతమ్‌ జుకాల్కర్‌ స్పందించక తప్పలేదు...

సమంత నా సోదరి... నాగచైతన్యకు తెలుసు!

స్టయిలిస్ట్‌ ప్రీతమ్‌ జుకాల్కర్‌తో సమంతకు ఎఫైర్‌ ఉందని సోషల్‌, వెబ్‌ మీడియాలో విసృతంగా వదంతులు వినిపించాయి. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోవడానికి అతడే కారణమన్నారు. దాంతో ప్రీతమ్‌ జుకాల్కర్‌ స్పందించక తప్పలేదు. ‘‘సమంతను సోదరిలా భావిస్తా. తనను జీజీ (హిందీలో అక్క) అని పిలుస్తా. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అటువంటి మా మధ్య అక్రమ సంబంధం ఎలా అంటగడతారు? సమంతకు ఐలవ్యూ ఎలా చెప్పావని నన్ను కామెంట్‌ చేస్తున్నారు. సిస్టర్‌ మీద ప్రేమను వ్యక్తం చేయకూడదా? నాగచైతన్య నాకు కొన్నేళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం కూడా తెలుసు. మా గురించి అలా కామెంట్‌ చేయవద్దని చెబుతాడని ఆశించా. అతడు ఒక స్టేట్మెంట్‌ విడుదల చేసినా... ఎంతో మార్పు వస్తుంది. వదంతులు వ్యాప్తి చేస్తున్న అభిమానులు చైతన్య చెబితే తప్ప ఆగరు ’’ అని ప్రీతమ్‌ జుకాల్కర్‌ ఆ ఆంగ్ల పత్రికతో చెప్పారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే చంపేస్తామని గుర్తుతెలియని వక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు.


Updated Date - 2021-10-12T06:26:21+05:30 IST