సమంత ఆ పోస్ట్‌ డిలీట్‌ చేసింది!

ABN , First Publish Date - 2022-01-21T21:17:33+05:30 IST

స్టార్‌ కథానాయిక సమంత నాగచైతన్యతో వివాహబంధానికి స్వస్తి పలికి నాలుగు నెలలు కావొస్తుంది. విడిపోతున్న విషయాన్ని గత ఏడాది అక్టోబర్‌ 2న ఇరువురు స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేసి వెల్లడించారు. నెట్టింట యాక్టివ్‌గా ఉండే సమంత తన ఇన్‌స్టా ఖాతాలో చైతూకి సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటిగా డిలీట్‌ చేసింది.

సమంత ఆ పోస్ట్‌ డిలీట్‌ చేసింది!

స్టార్‌ కథానాయిక సమంత నాగచైతన్యతో వివాహబంధానికి స్వస్తి పలికి నాలుగు నెలలు కావొస్తుంది. విడిపోతున్న విషయాన్ని గత ఏడాది అక్టోబర్‌ 2న ఇరువురు స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేసి వెల్లడించారు. ఆ తర్వాత నెట్టింట యాక్టివ్‌గా ఉండే సమంత తన ఇన్‌స్టా ఖాతాలో చైతూకి సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటిగా డిలీట్‌ చేసింది. విడిపోవడానికి గల కారణాన్ని చెప్పి చెప్పనట్లు చెప్పింది. తాజాగా ఓ వింత చోటు చేసుకుంది. చైతూతో విడిపోతున్నట్లు చేసిన పోస్ట్‌ను సమంత డిలీట్‌ చేసింది. దీనితో కొందరు పాజిటివ్‌గా తీసుకొని ఆనందిస్తే.. మరి కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఆ పోస్ట్‌ ఎందుకు డిలీట్‌ చేసింది అనేవిధంగా కొందరు ప్రశ్నలు సంధిస్తుంటే.. మరికొందరు మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నారేమో అనేలా కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. 


ప్రస్తుతం సమంత కెరీర్‌ మంచి జోరు మీదుంది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల పైనా సామ్‌ దృష్టి పెట్టింది. అటు తమిళ చిత్రాలతోనూ బిజీగా ఉంది. హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది. హాలీవుడ్‌ నుండి కూడా ఓ అవకాశాన్ని అందుకున్నారు సమంత. 




Updated Date - 2022-01-21T21:17:33+05:30 IST