3యూట్యూబ్ ఛానల్స్‌పై సమంత పరువు నష్టం దావా
ABN , First Publish Date - 2021-10-20T20:42:19+05:30 IST
సమంత తనపై సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వివరించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పై పిల్ దాఖలు చేశారు సమంత.

తనపై సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వివరించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు సమంత. రీసెంట్ గా సమంతా, నాగచైతన్య బ్రేక్ అప్ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వారిద్దరిపై రకరకాల కథనాలు వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రసార మయ్యాయి. వాటిలో మూడు యూ ట్యూబ్ ఛానల్స్ పై సమంతా పరువు నష్టం దావా వేశారు. సుమన్ టివి, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పై పిల్ దాఖలు చేశారు. మరికాసేపట్లో సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు.