Samantha : మరో క్రేజీ చిత్రానికి కూడా ఊ.. అంటోందా?

ABN , First Publish Date - 2022-01-24T00:03:16+05:30 IST

‘పుష్ప’ చిత్రంలో ‘ఊ..అంటావా.. మావా ఉఊ అంటావా’ అనే పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది సమంత. స్టార్ స్టాటస్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ సమంత ఈ తరహా గీతంలో నర్తించడం అభిమానులకు షాక్ అనే చెప్పాలి. తన కెరీర్ లో ఎప్పుడూ చూడని విధంగా బోల్డ్ అవతారంలో సామ్ రెచ్చిపోయింది. ఈ పాట తెచ్చిపెట్టిన క్రేజ్‌తో సమంతకి ఇలాంటిదే మరో ఆఫర్ వచ్చిందట. రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండబోతోందట.

Samantha : మరో క్రేజీ చిత్రానికి కూడా ఊ.. అంటోందా?

‘పుష్ప’ చిత్రంలో ‘ఊ..అంటావా.. మావా ఉఊ అంటావా’ అనే పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది సమంత. స్టార్ స్టాటస్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ సమంత ఈ తరహా గీతంలో నర్తించడం అభిమానులకు షాక్ అనే చెప్పాలి. తన కెరీర్ లో ఎప్పుడూ చూడని విధంగా బోల్డ్ అవతారంలో సామ్ రెచ్చిపోయింది. ఈ పాట తెచ్చిపెట్టిన క్రేజ్‌తో సమంతకి ఇలాంటిదే మరో ఆఫర్ వచ్చిందట.  రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ హీరోగా  డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండబోతోందట. దాన్ని సమంత మీదే చిత్రీకరించాలని పూరీ అండ్ టీమ్ నిర్ణయించుకున్నారట. ఆమేరకు సామ్ తో చర్చలు జరుగుతున్నాయట. 


విజయ్ దేవరకొండ జోడీగా సామ్ .. ‘మహానటి’ లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న లైగర్ లో స్పెషల్ సాంగ్ కు నర్తించనుండడం విశేషాన్ని సంతరించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదలవుతోన్న కారణంగా ఈమూవీలో  సామ్ చేత ఐటెమ్ సాంగ్ చేయించాలని పూరీ అనుకుంటున్నారట. మరి మరోసారి ఐటెమ్ గాళ్ గా సామ్ ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. 

Updated Date - 2022-01-24T00:03:16+05:30 IST