Salman వద్దనుకుని వదిలేసుకున్న ఈ చిత్రాలతో.. బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన Shah Rukh Khan

ABN , First Publish Date - 2021-09-25T21:48:47+05:30 IST

సల్కాన్ ఖాన్, షారూక్‌ఖాన్‌కు బాలీవుడ్‌లో ఎంత క్రేజు ఉందో అందరికీ తెలుసు. వీరి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఇక నిర్మాతలకు పండగే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీరికి లెక్కనేనంత మంది అభిమానులు ఉన్నారు. ఇక కండల

Salman వద్దనుకుని వదిలేసుకున్న ఈ చిత్రాలతో.. బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన Shah Rukh Khan

సల్కాన్ ఖాన్, షారూక్‌ఖాన్‌కు బాలీవుడ్‌లో ఎంత క్రేజు ఉందో అందరికీ తెలుసు. వీరి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఇక నిర్మాతలకు పండగే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీరికి లెక్కనేనంత మంది అభిమానులు ఉన్నారు. ఇక కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పేరు వింటేనే.. బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈయన ఖాతాలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఉన్నాయి. అలాగే తనదైన స్టైల్‌తో ఎంతోమంది మగువల మనసు దోచుకుంటున్నాడు. ఈ వయసులోనూ తన ఫిట్‌నెస్ తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సల్మాన్ ఖాతాలో.. కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. సల్మాన్ వద్దనుకుని వదిలేసుకున్న సినిమాలు.. షారూక్‌ఖాన్‌కు కాసుల వర్షం కురిపించాయి. చాలా మంది హీరోల విషయంలో కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంటుంది. 


సల్మాన్‌ఖాన్ వద్దనుకున్న చిత్రాలు.. షారూక్‌కు కలిసిరావడమే కాకుండా, ఆయన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలుగా నిలిచాయి. షారూక్ నటించిన తర్వాత ఆ చిత్రాలను చూసి సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో బాధపడ్డారు. తమ హీరో నటించి ఉంటే.. సల్మాన్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరి ఉండేవే అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో సల్మాన్ ఖానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. చిన్న చిన్న కారణాలతో తాను వద్దనుకున్న చిత్రాలు.. షారూక్‌కు బాగా కలిసొచ్చాయి అని తెలిపారు. ఆ విజయవంతమైన చిత్రాల గురించి మనమూ ఓ లుక్కేద్దామా...


దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే: ఈ చిత్రం గురించి ప్రేమికులకు చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో సంవత్సరాలు ఆడిన ఈ సినిమా.. భారీ వసూళ్లనే రాబట్టింది. రాజ్, సిమ్రన్‌ పాత్రల్లో షారుక్, కాజోల్‌లు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ చిత్రంతో షారుక్‌‌కు కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా పేరొచ్చింది. దీన్ని కూడా మొదట్లో సల్మాన్‌ఖాన్‌తో తీయాలనుకున్నారట.


కల్‌ హో నా హో: షారుక్‌ఖాన్, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో.. నిఖిల్‌ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. బాక్సాఫీసుని వసూళ్లతో నింపేసింది. ఈ చిత్రంలో ప్రీతి జింటా నాయికగా నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ పోషించిన రోహిత్‌ పటేల్‌ పాత్ర కోసం.. ముందుగా సల్మాన్‌ఖాన్‌నే సంప్రదించారట. అయితే షారుక్‌ నటిస్తున్న చిత్రంలో రెండో హీరోగా చేయడం ఇష్టం లేక సల్మాన్‌.. దీన్నీ వదిలేసుకున్నారు.


బాజీగర్‌: అబ్బాస్‌ మస్తాన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజోల్, శిల్పాశెట్టి నాయికలుగా నటించారు. రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో రూ.18 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ కథ మొదట సల్మాన్‌ఖాన్‌ వద్దకే వచ్చింది. అయితే కొన్ని మార్పు చేయాలని సల్మాన్ తండ్రి అడగ్గా.. డైరెక్టర్ అందుకు ఒప్పుకోకపోవడంతో వదులుకున్నాడు. ఆ చిత్రంలో తల్లి సెంటిమెంట్ ఉంటే బాగుటుందని తన తండ్రి చెప్పినా అబ్బాస్ వినలేదని.. తర్వాత షారుక్‌‌తో తీసినప్పుడు తల్లి సెంటిమెంట్‌ను జోడించారని గుర్తు చేశారు. అయినా తాను దాని గురించి పట్టించుకోలేదని తెలిపారు. 


జోష్‌: షారూక్‌కు కలిసొచ్చిన చిత్రాల్లో జోష్ ఒకటి. పేరుకు తగ్గట్టుగా షారూక్ సిని కెరీకు మంచి జోష్ తెచ్చందీ చిత్రం. ఈ చిత్రంలో షారుక్‌ పోషించిన పాత్ర కోసం ముందుగా సల్మాన్‌నే అనుకున్నారు. అయితే డేట్స్‌ కుదరక.. కథ నచ్చినా వదిలేసుకున్నారట సల్మాన్‌. రూ.16కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.36కోట్లకు పైగానే వసూలు చేసింది.


చక్‌ దే ఇండియా: క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో హాకీ కోచ్‌గా షారుక్‌ అద్భుతంగా నటించారు. 2007లో వచ్చిన ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.110కోట్లకు పైగానే వసూలు చేసింది. అయితే కేవలం టైటిల్ కారణంగా సల్మాన్.. ఈ చిత్రాన్ని వదులుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లోనూ తనకు అభిమానులున్నారని, ఈ చిత్రం చేస్తే సమస్య వస్తుందని వద్దనుకున్నారట.


జీరో: పేరులో జీరో ఉన్నా... ఈ చిత్రం కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో నటించారు. దీనికి ఆయనకు మంచి పేరొచ్చింది. అయితే మరుగుజ్జు పాత్ర చేయడం ఇష్టం లేక, మన కండలవీరుడు ఈ చిత్రాన్ని కూడా వదిలేసుకున్నారు. ఈ విషయాన్ని షారూక్ స్వయంగా చెప్పారు.

Updated Date - 2021-09-25T21:48:47+05:30 IST