Bigg Boss: నిజంగా నాకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటే.. జీవితాంతం ఏ పనీ చేయకుండా ఎంజాయ్ చేసేవాడిని..!

ABN , First Publish Date - 2022-09-28T19:06:09+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న షోలలో బిగ్‌బాస్ (Bigg Boss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న..

Bigg Boss: నిజంగా నాకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటే.. జీవితాంతం ఏ పనీ చేయకుండా ఎంజాయ్ చేసేవాడిని..!

దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న షోలలో బిగ్‌బాస్ (Bigg Boss) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్‌కి సిద్ధమవుతోంది. మొదటి రెండు సీజన్ల తర్వాత మూడో సీజన్ నుంచి ఇప్పటి వరకూ సల్మాన్ ఖానే (Salman Khan) హోస్ట్‌గా వ్యవహారిస్తున్నాడు. పదహారో సీజన్ ప్రారంభం కానున్న ఈ తరుణంలో ఆయన రెమ్యూనరేషన్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేసింది. అదే.. బిగ్ బాస్ 16 కోసం ఏకంగా రూ.1000 కోట్ల ఫీజు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ న్యూస్‌పై తాజాగా జరిగిన బిగ్‌బాస్ 16 లాంచ్ ఈవెంట్‌(లో సల్మాన్ స్పందించాడు.


ఆ ఈవెంట్‌లో.. ‘షో హోస్ట్ చేయడానికి రూ.1000 కోట్లు వసూలు చేస్తున్నారా?’ అని సల్మాన్‌ని ఈవెంట్ హోస్ట్ గౌహర్ ఖాన్ (Gauahar Khan) అడిగింది. దీనిపై సల్మాన్ స్పందిస్తూ.. ‘అవన్నీ తప్పుడు వార్తలు. అంత డబ్బు వస్తే జీవితంలో ఎప్పటికీ పనిచేయకుండా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని. కానీ.. నాకు అంత డబ్బు వచ్చే రోజు జీవితంలో తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా.. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. లాయర్ల ఖర్చులు వంటివి. వాటికి నాకు చాలా డబ్బు అవసరం’ అని ఫన్నీగా చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ ఫీజు రూ.1000 కోట్లలో పావు వంతు కూడా కాదు. ఆదాయపు పన్ను, ఈడీ అధికారులు ఈ నివేదికలను చదివి ఇంటికి వచ్చి తనిఖీ చేస్తారు. అప్పుడు నా దగ్గర ఉన్నవాటి గురించి అందరికీ నిజం తెలుస్తుంది’ అని తెలిపాడు.


అయితే.. నివేదికల ప్రకారం బిగ్‌బాస్ గత సీజన్ (15 సీజన్)కి సల్మాన్ దాదాపు రూ.350 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తర్వాతి సీజన్‌కి అందుకు మూడు రెట్లు అంటే.. దాదాపు రూ.1050 కోట్లు అందుకోనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా.. ‘బిగ్ బాస్ 16’ షో కంటెస్టెంట్స్ వీరే అంటూ రకరకాల ప్రచారాలు జరగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సల్మాన్ ఖాన్ మొగాంబో అవతార్‌లో కనిపించాడు. అలాగే.. లాంచ్ ఈవెంట్ సందర్భంగా షో పోటీదారుల గురించి మాట్లాడుతూ.. షో మేకర్స్ మొదటి కంటెస్టెంట్‌గా తజికిస్తాన్ ఆర్టిస్ట్ అబ్దు రోజిక్ పేరును ప్రకటించారు. అతనితోపాటు టీనా దత్తా, శ్రీజితా, గౌతమ్ విగ్, షాలినీ భానోత్, సుంబుల్ తౌకీర్, నిమృత్ కౌర్ అహ్లువాలియా పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిపై ఇంతవరకూ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated Date - 2022-09-28T19:06:09+05:30 IST