Katamarayudu: మళ్లీ రీమేక్ చేస్తున్నారట!

ABN , First Publish Date - 2022-08-18T03:38:19+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), శృతిహాసన్ (Shruti Haasan) జంటగా కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాటమరాయుడు’ (Katamarayudu). ఈ చిత్రాన్ని ఇప్పుడు

Katamarayudu: మళ్లీ రీమేక్ చేస్తున్నారట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), శృతిహాసన్ (Shruti Haasan) జంటగా కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాటమరాయుడు’ (Katamarayudu). ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ హీరో రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తమిళ ‘వీరమ్’ (Veeram) సినిమాకి రీమేక్. శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరమ్’ చిత్రం తెలుగులో కూడా డబ్ అయింది. తెలుగులో డబ్ అయిన తర్వాత కూడా.. ఈ సినిమాలో ఉన్న హీరోయిజం ఎలిమెంట్స్‌ని దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్‌తో నిర్మాత శరత్ మరార్ రీమేక్ చేశారు. ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలీ (కిషోర్ కుమార్ పార్థసాని).. ‘వీరమ్’ కథకి చిన్న చిన్న మార్పులు చేసి.. ‘కాటమరాయుడు’గా తెరకెక్కించారు. అయితే అప్పటికే అజిత్ నటించిన ‘వీరమ్’ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా చిత్రం యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది.


ఇప్పుడిదే చిత్రాన్ని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan).. బాలీవుడ్‌లో ఓ ప్రముఖ బ్యానర్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా.. అక్కడి మీడియా రాసుకొస్తుంది. అయితే ‘వీరమ్’ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేశారు. పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ కూడా హిందీలో డబ్ అయింది. మళ్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే వార్తలు సౌత్ ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ (Dabangg) చిత్రాన్ని.. పవన్ కల్యాణ్ తెలుగులో ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh) పేరుతో రీమేక్ చేసి.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఆ సినిమా తెలుగులో డబ్ కాలేదు. కానీ, ఇప్పుడు సల్మాన్ చేయాలనుకుంటున్న రీమేక్ ఇప్పటికే సౌత్ దాటి నార్త్‌లో కూడా సందడి చేసింది. అలాంటి చిత్రాన్ని సల్మాన్ ఎందుకు రీమేక్ చేయాలని అనుకుంటున్నాడో? అసలీ వార్తలో ఎంత నిజముందో? అనేది తెలియాల్సి ఉంది.



Updated Date - 2022-08-18T03:38:19+05:30 IST