SALMAN KHAN : థియేటర్ లోపల ‘అటువంటి పనులు’ చేయకండి

ABN , First Publish Date - 2021-11-28T15:53:53+05:30 IST

సల్మాన్ ఖాన్ తన సొషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ‘అంతిమ్’ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు...

SALMAN KHAN : థియేటర్ లోపల ‘అటువంటి పనులు’ చేయకండి

సల్మాన్ ఖాన్ తన సొషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ‘అంతిమ్’ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు టపాసులు పేల్చటం కనిపిస్తోంది. అయితే, సినిమా ప్రదర్శించే హాలు లోపల ఆ విధంగా క్రాకర్స్ కాల్చటం ప్రమాదకరమని సల్మాన్ హెచ్చరించాడు.



‘‘ఆడిటోరియమ్ లోపల టపాసులు కాల్చ వద్దని నా ఫ్యాన్స్‌ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే, తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. అప్పుడు మీ ప్రాణాలతో పాటూ ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి...’’ అని సల్మాన్ అభిమానులకి జాగ్రత్త చెప్పాడు. మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న భాయ్‌జాన్ ఇలా నాలుగు మంచి మాటలు చెప్పటం నిజంగా ప్రశంసనీయమే!


‘అంతిమ్ : ద ఫైనల్ ట్రూత్’ సినిమా నవంబర్ 26న శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా విడుదలైంది. మల్టీస్టారర్‌గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌లో సల్మాన్ కీలక పాత్ర పోషించగా ఆయన రియల్ లైఫ్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటించాడు. ‘అంతిమ్’ ప్రస్తుతం మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్స్‌తో ముందుకు సాగుతోంది.  

Updated Date - 2021-11-28T15:53:53+05:30 IST