Godfather : సల్లూ భాయ్ డేట్స్ ఇచ్చాడా?

ABN , First Publish Date - 2022-01-24T18:16:23+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. చిరుకిది 153వ చిత్రం. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు కరోనా థర్డ్ వేవ్ వల్ల అవాంతరం ఏర్పడింది. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. నయనతర కీలక పాత్ర పోషిస్తుండగా.. సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇందులో మరో అతి ముఖ్యమైన పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

Godfather : సల్లూ భాయ్ డేట్స్ ఇచ్చాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. చిరుకిది 153వ చిత్రం. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు కరోనా థర్డ్ వేవ్ వల్ల అవాంతరం ఏర్పడింది. త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. నయనతర కీలక పాత్ర పోషిస్తుండగా.. సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇందులో మరో అతి ముఖ్యమైన పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉన్న కారణంగానే సల్మాన్ ఈ సినిమాలో క్యామియో పాత్రను చేయబోతున్నాడట. ఇక తాజాగా సల్లూభాయ్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించాడని సమాచారం. 


ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ, మార్చ్ మొదటి వారంలో గానీ సల్మాన్ ఖాన్ ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. చిరంజీవికి రైట్ హ్యాండ్ లాంటి పాత్రను సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పాత్రను పృధ్విరాజ్ చేశాడు. దర్శకుడు అతడే అవడం వల్ల అందులో ఆయన నటించడం సాధ్యమైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంబంధించిన మరో హైలైట్ ఏంటంటే.. చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై ప్రత్యేక పాట కూడా ఉండబోతోందట. ఇద్దరూ ఆ పాటలో డ్యాన్స్ చేయడం అభిమానులకు కనుల విందేనని వేరే చెప్పాలా? త్వరలోనే సల్మాన్ ఖాన్ ఎంట్రీ గురించి అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. 

Updated Date - 2022-01-24T18:16:23+05:30 IST