రెండు భాగాలుగా ‘స‌లార్‌’..?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘స‌లార్‌’. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించ‌నున్నారంటూ నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ చిత్రాల త‌ర‌హాలో స‌లార్ కూడా రెండు పార్టులుగా రానుంద‌నే దానిపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.