సలార్..గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. బాహుబలి (Baahubali) మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ వస్తున్నారు. ఇటు సౌత్ అటు బాలీవుడ్‌లోనూ అందరి చూపు ప్రభాస్ సినిమాలపైనే ఉంది. ఇప్పటికే వచ్చిన పాన్ ఇండియా సినిమాలు సాహో (saaho), రాధేశ్యామ్ (Rdhe Shyam) అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా, కూడా ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ లిస్టులో ఉన్న చిత్రాల్లో ‘సలార్’ (Salaar) ఒకటి.
ఈ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ల కాంబినేషనే.కె.జి.యఫ్ (KGF) చిత్రంతో రీసెంట్గా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘సలార్’ సినిమా అంటే మాస్ అండ్ ఫ్యాన్స్ ఆడియెన్స్ ట్రీట్ పక్కా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. సినిమాపై ఇప్పటి వరకు అప్డేట్ లేదు. దీంతో సలార్ మేకర్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి గుడ్ ఇది అని అనుకోవచ్చు. లేటెస్ట్ సమాచారం మేరకు సలార్ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు తెలుస్తోంది. నిజంగా గనక ఫస్ట్ టీజర్ వస్తే ఇప్పుడున్న అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక 2023, జూలై లోనే సలార్ రిలీజ్ (Salaar Release) ఉంటుందని అంటున్నారు. కె.జి.యఫ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale Films) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శృతి హాసన్ (Shruti Haasan) ఇందులో హీరోయిన్గా నటిస్తోంది.