Salaar : యాక్షన్ సీక్వెన్స్ కోసం అన్ని కోట్లా?

ABN , First Publish Date - 2022-01-17T17:20:13+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరిదశలో ఉంది. బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రం తెరకెక్కుతోంది. ‘కేజీఎఫ్’ లాంటి హైఓల్టేజ్ మూని తీసిన ప్రశాంత్ నీల్ సినిమా కావడంతో సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాల్ని అందుకోడానికి మేకర్స్ అందుకు తగ్గరీతిలోనే సినిమా కోసం అత్యంత భారీగా ఖర్చు పెడుతున్నారు.

దాదాపు రూ.350కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలోని హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 20కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇందులోప్రభాస్,  శ్రుతి హాసన్ మధ్య లవ్ ట్రాక్ చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. 

Updated Date - 2022-01-17T17:20:13+05:30 IST