Republic: ఏడు రోజుల్లో 12 కోట్ల వ్యూయింగ్ మినిట్స్
ABN , First Publish Date - 2021-12-05T00:40:05+05:30 IST
సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ చిత్రం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. సినిమా సాధించిన విజయం పట్ల సాయి తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తాము ఆశించింది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో చెప్పిన చిత్రం రిపబ్లిక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఆశించింది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో...
సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ చిత్రం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. సినిమా సాధించిన విజయం పట్ల సాయి తేజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తాము ఆశించింది దొరికితే ప్రజానీకం స్పందన ఎలా ఉంటుందో చెప్పిన చిత్రం రిపబ్లిక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏడురోజుల్లోనే 12 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ అంటూ ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకులముందుకొచ్చింది. నవంబర్ 26న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష స్పందన లభించింది.