యన్టీఆర్ కథానాయికగా Saipallavi ?

ABN , First Publish Date - 2022-05-24T14:45:28+05:30 IST

దక్షిణాది టాలెంటెడ్ బ్యూటీస్‌లో సాయిపల్లవి (Saipallavi) ముందు వరుసలో ఉంటుంది. అందమైన అభినయం, అభినయానికి తగ్గ అందం ఆమె ప్రత్యేకత. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే సత్తా కలిగిన ఆమె.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించింది. అయితే టాలీవుడ్ లో ఆమె ఇంతవరకూ మీడియమ్ రేంజ్ హీరోల సరసనే కథానాయికగా మెరిసింది. టాప్ స్టార్స్ తో రొమాన్స్ చేయనేలేదు.

యన్టీఆర్ కథానాయికగా Saipallavi ?

దక్షిణాది టాలెంటెడ్ బ్యూటీస్‌లో సాయిపల్లవి (Saipallavi) ముందు వరుసలో ఉంటుంది. అందమైన అభినయం, అభినయానికి తగ్గ అందం ఆమె ప్రత్యేకత. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగే సత్తా కలిగిన ఆమె..  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించింది. అయితే టాలీవుడ్ లో ఆమె ఇంతవరకూ మీడియమ్ రేంజ్ హీరోల సరసనే కథానాయికగా మెరిసింది. టాప్ స్టార్స్ తో రొమాన్స్ చేయనేలేదు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం NTR 30 లో సాయిపల్లవి కథానాయికగా ఖాయమైందనే వార్తలొస్తున్నాయి. యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) 30వ చిత్రంగా, కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న చిత్రానికి ఇంతవరకూ హీరోయిన్ సెట్ అవలేదు. చాలా మంది లిస్ట్ లో ఉన్నప్పటికీ.. ఎవరూ ఫైనలైజ్ కాలేదు. అయితే ఈ సినిమా కథాంశం ప్రకారం కథానాయికగా సాయిపల్లవి అయితే బెటరని దర్శకుడు కొరటాల భావిస్తున్నారట. 


సాయిపల్లవి (Saipallavi ) సైతం యన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ను యన్టీఆర్ పుట్టినరోజు నాడే రివీల్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికింకా సాయిపల్లవి ఎంపిక పూర్తవలేదు. సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో తారక్.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నేపథ్యంలో NTR 30 కథలో భారీ మార్పులు చేస్తున్నారు కొరటాల. తారక్ పాన్ ఇండియా ఇమేజ్‌కు అనుగుణంగా.. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా టేకింగ్, మేకింగ్ విషయంలోనూ చాలా కేర్ తీసుకోనున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలోని నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను ఓ రేంజ్ లో ఉండాలనుకుంటున్నారట. అందుకే కథానాయికగా సాయిపల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది.  


సాయిపల్లవి (Saipallavi) గత చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singharoy) పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. అందులోని ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.  తదుపరిగా ఆమె నటించిన ‘విరాటపర్వం’ (Virata parvam) చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. అలాగే ఆమె నటించిన ‘గార్గి’ అనే తమిళ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సాయిపల్లవి NTR 30 చిత్రానికి షిఫ్ట్ అవుతుంది. జూలైలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఏ తరహా పాత్ర పోషిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-05-24T14:45:28+05:30 IST