సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలోని మూడో సినిమా అనౌన్స్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది. సినిమా సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయి. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ లోనూ, త్రివిక్రమ్ పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రం షూటింగ్ బిజీలోనూ ఉన్నారు. అతి త్వరలో ఈ ఇద్దరి కలయికలో సినిమా ప్రారంభం కాబోతోంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే కావడం తో పాటు, ‘అతడు, ఖలేజా’ తర్వాత మహేశ్ బాబుతో చేయబోతున్న మరో మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా రూపొందనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. హీరో చెల్లెలు పాత్ర సినిమాకి చాలా కీలకమట. అందుకే ఆ పాత్రలో సాయిపల్లవిని ఎంపిక చేయబోతున్నారని టాక్.
నిజానికి సాయిపల్లవికి చిరంజీవి ‘భోళాశంకర్’ లో చిరు సిస్టర్ గా నటించే ఛాన్స్ వచ్చింది. అయితే తాను రీమేక్స్ చేయకూడదని డిసైడయ్యానని, అందుకే తనకొచ్చిన ఆఫర్ ను తిరస్కరించానని సాయిపల్లవే స్వయంగా చెప్పింది. ఇది స్ట్రైట్ కథే కాబట్టి.. సాయిపల్లవికి మహేశ్ చెల్లెలిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవనుకోవాలి. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ కూడా ఆమెకి బాగా తెలుసు కాబట్టి.. ఈ సినిమాకి సాయిపల్లవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. అలాగే మరో కథానాయికని కూడా ఎంపిక చేయబోతున్నారు. ఏప్రిల్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మొదటి షెడ్యూల్ లో మహేశ్ బాబుపై ఒక సాంగ్, ఫైట్ చిత్రీకరిస్తారట. మరి సాయిపల్లవి నిజంగానే మహేశ్ కు చెల్లెలిగా నటించబోతుందేమో చూడాలి.