సీనియర్ నటి కూతురుతో చక్కర్లు కొడుతున్న సైఫ్ అలీఖాన్ కొడుకు

ABN , First Publish Date - 2022-01-22T22:35:01+05:30 IST

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, టీవీ నటి శ్వేత తివారీ కూతురు పలక్ తివారీతో ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు

సీనియర్ నటి కూతురుతో చక్కర్లు కొడుతున్న సైఫ్ అలీఖాన్ కొడుకు

సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్, టీవీ నటి శ్వేత తివారీ కూతురు పలక్ తివారీతో ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు. బాంద్రాలోని ఒక రెస్టారెంట్‌లో ఇబ్రహీం, పలక్ జనవరి 21న డిన్నర్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియా కంట పడ్డారు. దాంతో ఫొటోగ్రాఫర్లు వారిని క్లిక్ మనిపించారు. 


ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బీ టౌన్‌లో కొత్తగా మరో జంట డేటింగ్ చేయడం మొదలు పెట్టిందనే పుకార్లు గుప్పుమన్నాయి. ఫొటోలు, వీడియోల్లో పలక్ తన ముఖాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించడంతో నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీరిద్దరూ స్నేహితులైతే సిగ్గుతో ఎందుకు ముఖాన్ని దాచి పెట్టుకుంటున్నావు’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ఆమె ఎందుకు ముఖాన్ని చూపించడం లేద’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. 


పలక్ తివారీకి సినిమా ఇండస్ట్రీ కొత్తేం కాదు. ఆమె గతంలో ఒక షార్ట్ ఫిలింలో నటించింది. హార్డీ సంధూ మ్యూజిక్ వీడియో ‘బిజిలీ బిజిలీ’లోను ఆమె కనిపించింది.



Updated Date - 2022-01-22T22:35:01+05:30 IST