‘బంటీ ఔర్ బబ్లీ’ కాంట్రవర్సీ.. Abhishek Bachchan ప్లేస్‌లో తను రావడానికి కారణం చెప్పిన Saif Ali Khan..

ABN , First Publish Date - 2021-11-21T18:54:14+05:30 IST

‘బంటీ ఔర్ బబ్లీ’.. అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రం 2005లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది...

‘బంటీ ఔర్ బబ్లీ’ కాంట్రవర్సీ.. Abhishek Bachchan ప్లేస్‌లో తను రావడానికి కారణం చెప్పిన Saif Ali Khan..

‘బంటీ ఔర్ బబ్లీ’.. అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రం 2005లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ తెరకెక్కింది. అయితే ఇందులో ఒక మార్పు. అదే అభిషేక్ ప్లేస్‌లో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. నవంబర్ 19న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. 


అభిషేక్ ప్లేస్‌లో సైఫ్ రావడంపై కాంట్రవర్సీ మొదలైంది. చాలామంది బచ్చన్ అభిమానులు ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు సైఫ్.


ఓ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘నిజాయతీ చెబుతున్న.. ఓ రోజు ఆదిత్య చోప్రా కాల్ చేశాడు. ఈ సినిమా ఒరిజినల్ కాస్ట్‌తో కథని తెరకెక్కించలేకపోతున్నాం. ఇందులో చేయడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఈ మూవీపై డబ్బులు పెట్టే వాళ్లకి ఏం చేయాలో తెలుసు. ఒక మార్గం జరగకపోతే.. మరో మార్గంలో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే నా సమ్మతిని చెప్పాన’ని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా ఆయన యశ్ రాజ్ ఫిలీంస్‌తో పని చేయలేదని, ఇది వారి రిలేషన్‌షిప్‌కి ఉపయోపడుతుందని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-11-21T18:54:14+05:30 IST