Sai dharam tej : మీడియా ముందుకు వస్తాడనుకుంటే ఇలా చేశాడేంటి?

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్.. సెప్టెంబర్ 10న హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్‌పై బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. నెలరోజులు అపోలో హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న సాయి ధరమ్.. ప్రస్తుతం దాన్ని నుంచి పూర్తిగా కోలుకున్నారు. తను చేయాల్సిన సినిమాల్ని 2022కు వాయిదా వేసి.. పూర్తి రెస్ట్ లో ఉన్న ఆయన.. తాజా చిత్రం ‘రిపబ్లిక్’ డిజిటల్ రిలీజ్ ఈవెంట్  ప్రమోషన్స్ ఈ రోజు (బుధవారం) ప్రసాద్ లాబ్స్ లో జరిగాయి. దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ చిత్రం సాయిధరమ్ హాస్పిటల్ లో ఉండగా రిలీజైంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 26న జీ5 ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరగబోయే ప్రమోషనల్ ఈవెంట్ లో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని జీ5 వర్గాల వారు వెల్లడించారు. సాయిధరమ్ తేజ్ ఆ ఈవెంట్ కు రావడమే ఆ సర్ ప్రైజ్ అని అభిమానులు భావించారు.


అయితే ఈ కార్యక్రమానికి సాయిధరమ్ అటెండ్ కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందనుకుంటే ఇలా చేశాడేంటి అని అనుకున్నారు. బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన మొదటి సారిగా  మీడియా ముందుకు వచ్చి మాట్లాడాతారనుకున్నారు. కానీ ఆయన ఓ ఆడియో సందేశంతో సరిపెట్టడం మాత్రం అందరినీ డిజప్పాయింట్ చేసింది. ఇక సాయిధరమ్ కొత్త చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం. సుకుమార్ శిష్యుడు దండు కార్తిక్ దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.