'సిరివెన్నెల' చివరి పాటపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్..

హీరోయిన్ సాయి పల్లవి లెజండరీ లిరిక్ రైటర్ 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట 'సిరివెన్నల'పై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, వీడియోలు, పాటలు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట 'సిరివెన్నల' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అద్భుతమైన సాహిత్యంతో మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ఇది సిరివెన్నెల రాసిన చివరి పాట కావడంతో చిత్ర యూనిట్ ఒక్కక్కరు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా స్పందించింది. దీనికి సంబందించి ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. "మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తుంది. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు" అంటూ ట్వీట్‌లో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.