'బంగార్రాజు'కి మెగా మేనల్లుడు విషెస్..

'బంగార్రాజు' చిత్ర బృందానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ ఆల్‌ది బెస్ట్ అంటూ సోషల్ మీడియా వేదిక విషెస్ తెలిపారు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తాజా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ - జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ 'బంగార్రాజు' చిత్ర బృందానికి ఆల్‌దిబెస్ట్ తెలియచేశాడు. "ఈ పండుగ సీజన్‌లో స్క్రీన్‌పై డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని, ఖచ్చితంగా ఈ సినిమా మీలో జోష్ నింపబోతుంది".. అని సాయి తేజ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.