ఈ నెలలోనే సెట్స్‌లోకి సాయి ధరమ్ తేజ్..?

ఈ నెలలోనే సెట్స్‌లోకి సాయి ధరమ్ తేజ్ అడుగుపెట్టబోతున్నాడా..! అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్సిడెంట్ అయి తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకున్నారు. మళ్ళీ డబుల్ ఎనర్జీతో ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక మళ్ళీ సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారట. 'రిపబ్లిక్' సినిమా తర్వాత మొదలవ్వాల్సిన 'SDT 15'కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆ సినిమాను పట్టాలెక్కించబోతున్నారని తాజా సమాచారం. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించనుండగా, బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాటు కథను అందిస్తున్నారు. జనవరి మూడవ వారం నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలవనుందని తెలుస్తోంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.