కోలుకున్నాక సాయితేజ్‌ తొలి వీడియో... ఏమన్నాడంటే!

Twitter IconWatsapp IconFacebook Icon
కోలుకున్నాక సాయితేజ్‌ తొలి వీడియో... ఏమన్నాడంటే!

తను ప్రాణాలతో బయటపడటానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు పంజా సాయితేజ్‌. గత ఏడాది సెప్టెంబర్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తేజ్‌ కోలుకున్న తర్వాత తొలిసారి ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ ఆరు నెలల్లో హెల్త్‌, హ్యాపీనెస్‌, గ్రాటిట్యూడ్‌, ఫ్యామిలీ ఇలా చాలా విషయాల గురించి నేర్చుకున్నానని తెలిపారు. ఈ నెల 28న సాయితేజ్‌ హీరోగా సుకుమార్‌–బాపినీడు నిర్మిస్తున్న కొత్త చిత్రం ప్రారంభం కానుందని వెల్లడించారు. ఆయనకు రక్షణ కవచంలా నిలిచిన హెల్మెట్‌ను ముద్డాడారు. ఇంకా ఈ వీడియోలో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 


మానవత్వం బతికే ఉంది...

‘‘రోడ్డు ప్రమాదానికి గురైన నన్ను ఆస్పత్రికి తరలించిన సయ్యద్‌ అబ్దుల్‌ ఫహాద్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా. ఆయన వల్లే నేనీ రోజు ఇలా ఉన్నాను. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఆయనలాంటివారే నిలువెత్తు నిదర్శనం. ఆస్పత్రిలో నన్ను చూసుకున్న స్టాఫ్‌కు, డాక్టర్లకు కృతజ్ఞతలు. మా అమ్మ, వైష్ణవ్‌, శివ నా పరిస్థితి చూసి వారు ధైర్యంగా ఉండి అందరు ధైర్యంగా ఉండేలా చూశారు. నేను కోలుకున్న మూడు నెలల వరకూ అమ్మ నాకు ఫోన్‌ ఇవ్వలేదు. ఆ తర్వాత మెసేజ్‌లు చూసి మాట్లాడలేకపోయాను. నా స్టాఫ్‌ సతీష్‌, నరేంద్ర, నాగరాజు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. 

కోలుకున్నాక సాయితేజ్‌ తొలి వీడియో... ఏమన్నాడంటే!

ఫ్యామిలీ.. ఫ్యామిలీ.. ఫ్యామిలీ

ఇన్నిసార్లు ఫ్యామిలీ అంటున్నాడు ఏంటా అనుకుంటున్నారా? అందుకు కారణం లేకపోలేదు. 

ఫ్యామిలీ:1 

మా మావయ్యలు ముగ్గురు, అల్లు అరవింద్‌గారు, చరణ్‌, ఉపాసన, బన్నీ, వరుణ్‌, వైష్ణవ్‌ నా కోసం నిలబడిపోయారు. 

ఫ్యామిలీ:2

నేను ఆస్పత్రిలో ఉన్నానని తెలిసి ఇండస్ట్రీ నుంచి వచ్చిన నా తోటి నటీనటులు, దర్శకనిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. 

ఫ్యామిలీ:3

మూడో ఫ్యామిలీ అంటే నా అభిమానులు. అభిమానులు అంటే నా ఒక్కడి అభిమానులే కాదు. అందరు హీరోల అభిమానులు. నాకోసం పూజలు, అన్నదానాలు చేశారు. త్వరగా కోలుకోవాలని కాలినడనక మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుని నా కోసం మొక్కారు. ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎప్పటికప్పుడు నేను కోలుకుంటున్న విషయాన్ని ప్రజలకు చేరవేసిన మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే 


దెబ్బ తను తిని నన్ను బతికించింది..

"ఈ బుజ్జి తల్లి (హెల్మెట్‌)వల్లే నేను ఇలా ఉన్నాను. హెల్మెట్‌ ధరించడం వల్ల తలకు గాయం కాలేదు. కింద పడినా దెబ్బ నా  హెల్మెట్‌ తీసుకుని నన్ను రక్షించింది. పక్కి వీధికి వెళ్తున్నాం.. ఇక్కడే కదా అని హెల్మెట్‌ను ఆశ్రద్ద చేయకండి’’ అని వీడియోలో పేర్కొన్నారు. 



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.