Female: టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

ABN , First Publish Date - 2022-06-28T23:35:43+05:30 IST

విపిఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై.. నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రానికి ‘ఫిమేల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న

Female: టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

విపిఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై.. నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రానికి ‘ఫిమేల్’ (Female) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను తాజాగా తెలంగాణ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. 


టైటిల్ లుక్ విడుదల అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడి... మగాళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ.. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.


దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ.. రూపొందించిన ఈ విభిన్న కథాచిత్రం.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. టైటిల్ లుక్ విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం..’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-28T23:35:43+05:30 IST