సమంతతో విడిపోయాక.. Naga Chaitanyaపై మరో రూమర్! ఆ హీరోయిన్‌తో..?

Twitter IconWatsapp IconFacebook Icon
సమంతతో విడిపోయాక.. Naga Chaitanyaపై మరో రూమర్! ఆ హీరోయిన్‌తో..?

హీరోయిన్ సమంత(Samantha)తో విడాకుల అనంతరం నాగచైతన్య (Naga Chaitanya) మరో హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు ఈ లిస్ట్‌లోకి వచ్చి చేరింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి చిత్రాలలో నటించిన శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala). హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామతో చైతూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడనేలా.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సమంతతో విడిపోయాక.. Naga Chaitanyaపై మరో రూమర్! ఆ హీరోయిన్‌తో..?

ఈ వార్తల వెనుకున్న విషయం ఏమిటంటే.. జూబ్లీహిల్స్‌లోని చైతూ ఇంటికి ఆమె తరచూ వస్తుండటమే కారణంగా గాసిప్ రాయుళ్లు చెబుతున్నారు. ఇద్దరూ ఒకే కారులో చైతూ ఇంటికి రావడం, కాసేపటి తర్వాత ఆమె వెళ్లిపోవడం వంటివి కొందరు గమనించినట్లుగా చెబుతున్నారు. అలాగే ‘మేజర్’ చిత్ర షూటింగ్ సమయంలో కూడా శోభితను కలిసేందుకు ఆమె బస చేసిన హోటల్‌కి నాగచైతన్య వెళ్లేవాడట. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇవే కారణాలతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లుగా సోషల్ మీడియా అంతా ఒకటే వార్తలు. అయితే, ఇంతకు ముందు కూడా నాగచైతన్య విషయంలో ఇలాంటి వార్తలే వినిపించినా.. తర్వాత అవి వట్టి వదంతులుగానే మిగిలిపోయాయి. నిజంగా.. శోభిత, చైతూల మధ్య ఉన్న బంధం ఏమిటో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే వారి బంధంపై గట్టిగానే ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. 


ఇక చైతూ విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’ (Thank You) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha)లో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu), ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ (Prarasuram) దర్శకత్వంలో చైతూ చేయాల్సిన చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan: I)లో శోభిత ధూళిపాళ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మరికొన్ని చిత్రాలకు ఆమె సైన్ చేసినట్లుగా సమాచారం.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.