‘ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా... ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు... సూస్కుందాం రా’ అంటూ ప్రతినాయకుడిని సవాల్ చేశారు పంజా వైష్ణవ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న నూతన చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రంలో పవర్ఫుల్ లుక్, పవర్‌ప్యాక్డ్ యాక్షన్‌తో కథానాయకుడిని పరిచయం చేశారు. ముహూర్తపు షాట్‌కు హీరో సాయిధరమ్ తేజ్ క్లాప్ ఇచ్చారు. త్రివిక్రమ్ గౌరవ దర్శకత్వం వహించారు. నాగవంశీ స్ర్కిప్ట్‌ను దర్శకుడికి అందించారు. వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా శ్రీ లీల నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.