RRR: ట్రైలర్ వాయిదా..

ABN , First Publish Date - 2021-12-01T14:50:38+05:30 IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ నుంచి రావల్సిన థియేట్రికల్ ట్రైలర్ వాయిదా పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

RRR: ట్రైలర్ వాయిదా..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ నుంచి రావల్సిన థియేట్రికల్ ట్రైలర్ వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటించారు. అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్' మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రకటించిన తేదీకి ఈ ట్రైలర్ రావడం లేదు. అనుకోని కారణాలవల్ల ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేస్తూ, త్వరలోనే మళ్ళీ కొత్త డేట్‌ను ప్రకటించనున్నామని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Updated Date - 2021-12-01T14:50:38+05:30 IST