RRR: సంక్రాంతి కానుకగా స్పెషల్ పోస్టర్

పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్' నుంచి సంక్రాంతి కానుకగా స్పెషల్ పోస్టర్‌ను వదిలింది చిత్రబృందం. వాస్తవంగా అయితే ఈ పాటికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వసూళ్ళ సునామీని తలపించేది. కానీ, కరోనా కొత్త వైరస్ ఒమైక్రాన్ వ్యాప్తి కారణంగా తప్పని పరిస్థితుల్లో చిత్రబృంద ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. దాంతో కాస్త సర్‌ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి బృందం. 

ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రామరాజు, కొమురమ్ భీమ్ పాత్రల్లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ సహా పలువురు సౌత్ అండ్ హాలీవుడ్ స్టార్ కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.