తారక్ - చెర్రీ పార్టనర్స్‌గా RRR రెస్టారెంట్?

ABN , First Publish Date - 2022-06-24T00:46:50+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన ఈ పాన్ ఇండియా సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

తారక్ - చెర్రీ పార్టనర్స్‌గా RRR రెస్టారెంట్?

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన ఈ పాన్ ఇండియా సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1100 కోట్ల పైచిలుకు వసూళ్ళను రాబట్టి.. తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది. ఓటీటీలో సైతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి ఈ సినిమా గురించి అభిమానులు ఉప్పొంగిపోయే వార్తొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ పేరు మీద ఒక రెస్టారెంట్ రాబోతోందట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోరూరే వంటకాలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత అని టాక్. 


ఈ మధ్య ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత.. యన్టీఆర్, రామ్‌చరణ్‌ల దగ్గరకి ఈ ప్రపోజల్ తీసుకొచ్చాడట. ‘ఆర్.ఆర్.ఆర్’ పేరు తో ఓ రెస్టారెంట్ ప్రారంభించమని సూచించాడట. అయితే అది ఏదేశంలో అన్న విషయంలో క్లారిటీ లేదు. అంతేకాదు.. ఇందులో రాజమౌళిని కూడా భాగస్వామిగా చేరమని సలహా ఇచ్చాడట. అయితే తనకు సినిమాలు తప్ప వేరే వ్యాపారాల్లో ఆసక్తి లేదని జక్కన్న చెప్పడంతోనూ.. ప్రస్తుతం తారక్, చెర్రీలిద్దరూ వారి వారి ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉండడంతోనూ.. రెస్టారెంట్ బిజినెస్ ఆలోచన తాత్కాలికంగా హోల్ట్ లో పెట్టారని  తెలుస్తోంది.  ఏదేమేనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ హీరోలు ఫ్యూచర్ లో  అయినా రెస్టారెంట్ తెరిస్తే  చాలా బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఒక వేళ నిజంగానే ఆర్.ఆర్.ఆర్ పేరు మీద ఈ ఇద్దరూ రెస్టారెంట్ తెరిస్తే.. అది ప్రపంచంలోనే ఒక వండర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రుచికరమైన వంటకాలతో కస్టమర్స్‌ను ఆకర్షిస్తే చాలు.. ‘ఆర్.ఆర్.ఆర్’ రెస్టారెంట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-06-24T00:46:50+05:30 IST