RRR: సీతారామరాజు కొత్త లుక్‌ వచ్చేసింది!

ABN , First Publish Date - 2021-12-06T21:50:16+05:30 IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమురం భీమ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

RRR: సీతారామరాజు కొత్త లుక్‌ వచ్చేసింది!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమురం భీమ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్‌చరణ్‌ లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలుగా, అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రధారులుగా కనిపించనున్నారు. జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 




Updated Date - 2021-12-06T21:50:16+05:30 IST