రిలీజ్ రంజాన్2022 ?
ABN , First Publish Date - 2021-08-22T06:30:03+05:30 IST
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మళ్లీ విడుదల వాయిదా పడనుందా? అక్టోబర్ 13న కాకుండా వచ్చే ఏడాది రంజాన్‌కు...

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మళ్లీ విడుదల వాయిదా పడనుందా? అక్టోబర్ 13న కాకుండా వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుందా? అంటే... హిందీ సినిమా పరిశ్రమ వర్గాలు ‘అవును’ అనే అంటున్నాయి. దేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా వేయమని దర్శక-నిర్మాతలకు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు విజ్ఞప్తి చేశారట. తెలంగాణ మెజారిటీ థియేటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని థియేటర్లు తెరుచుకున్నప్పటికీ... ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అక్షయ్‌కుమార్ ‘బెల్ బాటమ్’ వసూళ్లు చూశాక, ‘ఆర్‌ఆర్‌ఆర్’ను వాయిదా వేయమంటున్నారట. అందుకని, విజయదశమికి కాకుండా వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా మే తొలి వారంలో విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారట. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియా, అలీసన్ డూడీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు.