'RRR': కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

ABN , First Publish Date - 2022-01-21T18:41:47+05:30 IST

'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఇప్పటికే మూడుసార్లు పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే.

'RRR': కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?

'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఇప్పటికే మూడుసార్లు పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి గ్యారెంటీగా రిలీజ్ చేస్తామని ఎంతో నమ్మకంగా రాజమౌళి బృందం నెలరోజులు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. తీరా రిలీజ్‌కు నాలుగురోజులుందనగా కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా నాలుగో సారి పోస్ట్‌పోన్ చేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో..! అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ''ఆర్ఆర్ఆర్'' చిత్రాన్ని ఏప్రిల్ 29న భారీ స్థాయిలో 14 భాషలలోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు మేకర్స్ ఇదే డేట్‌ను లాక్ చేసినట్టే అని సమాచారం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు రానుందో చూడాలి. 

Updated Date - 2022-01-21T18:41:47+05:30 IST