RRR: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్‌కి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌..?

ABN , First Publish Date - 2021-07-21T16:53:00+05:30 IST

'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్‌కి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ వర్క్ చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ ఏంటీ..? అనే ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట.

RRR: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్‌కి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌..?

'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్‌కి మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ వర్క్ చేయబోతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ ఏంటీ..? అనే ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఫిక్షనల్ కథాంశంతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఇందులో మెగా పవర్‌స్టార్ రాం చరణ్ - యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ శక్తివంతమైన పోరాట యోధులు కొమురం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 


చిత్రీకరణ చివరిదశకు చేరుకోవడంతో పాటు అక్టోబర్‌లో చిత్ర బృందం ప్రకటించిన తేదీకి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్న క్రమంలో టాలీవుడ్ స్టార్స్‌తో ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్‌ని కూడా నిర్మించారు. అయితే ఈ సాంగ్‌ను కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో తెలీదు గానీ, ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఓలివియా మోరిస్, సముద్రఖని సహా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఆలియా తాజాగా చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకుందని సమాచారం.     

Updated Date - 2021-07-21T16:53:00+05:30 IST