రౌడీబాయ్స్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌

‘‘సినిమా అంటే ఆశి్‌షకి ప్రాణం. హీరో అవ్వాలనే లక్ష్యంతో చాలా కష్టపడ్డాడు. సన్నబడేందుకు తీవ్రంగా శ్రమించాడు. న్యూయార్క్‌ వెళ్లి నటన లో శిక్షణ తీసుకున్నాడు. మా అండ లేకుండా తన కష్టంతో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలనేది నా ఆలోచన. అందుకే స్టార్‌ డైరెక్టర్‌ను పెట్టి భారీ బడ్జెట్‌తో సినిమా తీయలేదు’’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. శ్రీహర్ష కొనుగొంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘రౌడీబాయ్స్‌’. శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా దిల్‌ రాజు, ఆశిష్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘హుషారు’తో తన ప్రతిభ నిరూపించుకున్న శ్రీహర్ష ‘రౌడీబాయ్స్‌’ను యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌గా మలిచారు. లవ్‌, సెంటిమెంట్‌..ఇలా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి’’ అని దిల్‌రాజు అన్నారు. ‘పాత్రోచితంగా నటించావు’ అని ట్రైలర్‌ చూసినవాళ్లు ప్రశంసిస్తున్నారు. కాశీ అనే కొత్త దర్శకుడితో ‘సెల్ఫిష్‌’ చిత్రం చేస్తున్నాను’’ అని ఆశిష్‌ చెప్పారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.