ఏలూరులో ‘రౌడీ‌బాయ్స్’ విజయోత్సవం

ABN , First Publish Date - 2022-01-23T20:14:12+05:30 IST

‘రౌడీబాయ్స్’ చిత్ర యూనిట్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో సందడి చేసింది. విజయోత్సవంలో భాగంగా రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, సహనిర్మాత హర్షిత్ రెడ్డి, నటులు రచ్చ రవి, తేజ, యజ్ఞ, శ్రీధర్, సన్నీ ఆదివారం వి మాక్స్ థియేటర్కు చేరుకున్నారు. నేరుగా చిత్రం ప్రదర్శన జరుగుతున్న సమయంలో థియేటర్ లోకి చిత్ర బృందం వెళ్ళింది. ప్రేక్షకుల కేరింతల నడుమ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో ఆశిష్ తమ సినిమాను సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఏలూరులో ‘రౌడీ‌బాయ్స్’ విజయోత్సవం

‘రౌడీబాయ్స్’ చిత్ర యూనిట్ పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు నగరంలో సందడి చేసింది. విజయోత్సవంలో భాగంగా రౌడీ బాయ్స్ హీరో ఆశిష్, సహనిర్మాత హర్షిత్ రెడ్డి, నటులు రచ్చ రవి, తేజ, యజ్ఞ, శ్రీధర్, సన్నీ ఆదివారం వి మాక్స్ థియేటర్కు చేరుకున్నారు. నేరుగా చిత్రం ప్రదర్శన జరుగుతున్న సమయంలో థియేటర్ లోకి చిత్ర బృందం వెళ్ళింది. ప్రేక్షకుల కేరింతల నడుమ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా  హీరో ఆశిష్  తమ సినిమాను సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.  తమ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని, కరోనా వైరస్ కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వి మాక్స్ థియేటర్ మేనేజర్లు రాంబాబు ఎస్ ఆకర్షబాబు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-23T20:14:12+05:30 IST