రొమాంటిక్ రంజన్
ABN , First Publish Date - 2022-07-16T05:55:37+05:30 IST
వరుస సినిమాలతో బిజీ హారోగా దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం.

వరుస సినిమాలతో బిజీ హారోగా దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘రూల్స్ రంజన్’. ఇందులో కిరణ్ తొలిసారి పూర్తిస్థాయి క్లాస్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు. నేహాశెట్టి కథానాయిక. రత్నం కృష్ణ దర్శకుడు.
శుక్రవారం కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ‘రూల్స్ రంజన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్రబృదం విడుదల చేసింది.. ఇందులో ఆయన బిజినెస్ మ్యాన్ సూట్‌లో క్లాసీలుక్‌లో కనువిందు చేశారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి. మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్థి, అజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్.
మీటర్‌లో మాసివ్ లుక్
డిఫరెంట్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘మీటర్’. రమేష్ కాదూరి దర్శకుడు. క్లాప్ ఎంటర్టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. శుక్రవారం కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ‘మీటర్’ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కలర్‌ఫుల్ షర్ట్‌లో మాసివ్ లుక్‌లో కిర ణ్ ఆకట్టుకున్నారు. ఆయన ఇమేజ్‌ను మరింత పెంచేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. అతుల్యరవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.