Karan Johar: నాపై ట్రోల్స్ ప్రభావం ఉండదు.. కానీ, నా పిల్లలపై ట్రోల్స్ వస్తే మాత్రం..

ABN , First Publish Date - 2022-09-30T01:20:40+05:30 IST

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్‌లో కరణ్ జోహార్ (Karan Johar) ఒకరు. ధర్మ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది.

Karan Johar: నాపై ట్రోల్స్ ప్రభావం ఉండదు.. కానీ, నా పిల్లలపై ట్రోల్స్ వస్తే మాత్రం..

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్‌లో కరణ్ జోహార్ (Karan Johar) ఒకరు. ధర్మ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. అతడు హోస్ట్, డైరెక్టర్, రియాలిటీ షో జడ్జీ వంటి పలు రకాల పాత్రలను కూడా పోషిస్తుంటాడు. తరచుగా తన సినిమాల ద్వారా స్టార్స్ వారసులను లాంచ్ చేస్తుంటాడు. అందువల్ల కొంత మంది నెటిజన్స్ కరణ్‌ను కొన్నేళ్లుగా ట్రోల్ చేస్తున్నారు. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. సోషల్ మీడియా కామెంట్ బాక్స్‌ను అసభ్య పదజాలంతో నింపేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై కరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వాటి ప్రభావం తనపై ఉండదని చెప్పాడు. కానీ, తన పిల్లలు రూహీ, యశ్‌లపై ట్రోల్స్‌ వస్తే బాధపడతానని పేర్కొన్నాడు.       


కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో ఎన్‌ఎమ్. నిహారిక, డానిష్ సైత్, తన్మయ్ భట్, కుషా కపిల పాల్గొన్నారు. కరణ్ వీరందరితో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగానే ట్రోల్స్ గురించి మాట్లాడాడు. ‘‘కొనేళ్లుగా దృఢంగా ఉండటం నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ ట్రోల్స్ గురించి నేను పట్టించుకోను. కామెంట్స్‌ను చదివినప్పటికి ఆలోచించను. కానీ, నా పిల్లలను దూషించినప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది.  నా గురించి ఏం రాసినా, మాట్లాడినా దాని ప్రభావం నాపై ఉండదు’’ అని కరణ్ జోహార్ తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కరణ్ జోహార్ చివరగా ‘యే దిల్ హై ముష్కిల్’ (Ae Dil Hai Mushkil) కు దర్శకత్వం వహించాడు. రొమాంటిక్, మ్యూజికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ 2016లో విడుదలైంది. ‘యే దిల్ హై ముష్కిల్’ తర్వాత కరణ్ ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఆరేళ్ల అనంతరం మెగాఫోన్ పట్టుకున్నాడు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్, ధర్మేంద్ర, షబనా అజ్మీ, జయా బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.     


Updated Date - 2022-09-30T01:20:40+05:30 IST