హీరోయిన్‌తో డేట్ అంత సులభం కాదంటోన్న ఆమె భర్త

ABN , First Publish Date - 2022-01-20T23:30:32+05:30 IST

మహేశ్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి అమృతా రావ్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికి

హీరోయిన్‌తో డేట్ అంత సులభం కాదంటోన్న ఆమె భర్త

మహేశ్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి అమృతా రావ్. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించినప్పటికి సరి అయిన బాక్సాఫీస్ హిట్ లభించలేదు. అమృతా రావ్ ఆరేళ్ల క్రితం ఆర్‌జే. అన్మోల్‌ని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. అన్మోల్, అమృతా రావ్ చాలా రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో బీ టౌన్ మొత్తం షాకయింది. పెళ్లి చేసుకున్నాక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 


పెళ్లి అనంతరం ఈ దంపతులు యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించారు. ఆ ఛానల్‌లో వీడియోలను షేర్ చేస్తూ ఆసక్తికర విషయాలను నెటిజన్లకు తెలుపుతున్నారు. తాజాగా ఒక వీడియోని ఈ దంపతులు ఆ ఛానల్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ‘‘హీరోల గర్ల్ ఫ్రెండ్స్ నన్ను చూసి అసూయ పడేవారు. నేను హీరోలతో నటిస్తున్నప్పుడు అన్మోల్ అసూయ పడలేదు’’ అని అమృతా రావ్ చెప్పింది. ‘‘నేను కెరీర్ మొదలుపెట్టేటప్పటికి అమృతా రావ్ టాప్ బాలీవుడ్ హీరోయిన్. షూటింగ్‌లో ఉన్నప్పుడు అమృత మెసేజ్‌లకు రిప్లై ఇచ్చేది కాదు. కొంత మంది వ్యక్తులు వచ్చి నాకు ఫోన్ ఇచ్చి ఆమె‌తో తమ ఫొటో తీయమనేవారు. అటువంటి సమయంలో నేను అసూయ పడేవాడిని. హీరోయిన్‌‌ని డేట్ చేయడం అంత సులభం కాదు’’ అని అన్మోల్ వివరించారు.



Updated Date - 2022-01-20T23:30:32+05:30 IST