భూమి క్యారెక్టర్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటి: రీతువర్మ

ABN , First Publish Date - 2021-10-27T02:43:17+05:30 IST

నాగశౌర్య, రీతువర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి. ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా..

భూమి క్యారెక్టర్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటి: రీతువర్మ

నాగశౌర్య, రీతువర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి. ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్‌లలో విడుదలకాబోతోన్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ రీతు వర్మ మీడియాతో పంచుకున్నారు. 


ఆమె మాట్లాడుతూ.. ‘‘లక్ష్మీ సౌజన్య‌గారు ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. అలాగే భూమి పాత్ర కూడా ఎట్రాక్ట్ చేసింది. ఫీమేల్ లీడ్‌కి ఛాలెంజింగ్ రోల్స్ చాలా రేర్‌గా వస్తుంటాయి. అలాంటి పాత్రతో నేను చేసిన చిత్రమిది. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌కి, ఈ చిత్రంలోని పాత్రకి చాలా వేరియేషన్ ఉంటుంది. సినిమా చూశాక భూమి క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ ఫీమేల్ కాబట్టి నా పాత్ర అంత స్ట్రాంగ్‌గా రాసింది అనుకోను. ‘పెళ్లిచూపులు’లో కూడా నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాకపోతే లక్ష్మీ సౌజన్య ఒకమ్మాయి కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించి ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. భూమి క్యారెక్టర్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది.


టీజర్, ట్రైలర్ చూసి ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటున్నారు. కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ కాదు. ఒక ప్యూర్ లవ్ స్టోరి. మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినేలా సాంగ్స్ ఉంటాయి. శౌర్య క్యారెక్టర్‌కి స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ రిలీజ్ తర్వాత తెలుస్తాయి. తెరపై మా పెయిర్ వర్కౌట్ అయింది. శౌర్య చాలా డెడికేటెడ్‌గా ఉంటాడు. షూట్ ఉన్నప్పుడు టైమ్‌కి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాడు. వర్కౌట్స్ చేసి ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ‌కి పెయిర్ సెట్ అవ్వాలి. అప్పుడే సినిమా ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది. మా పెయిర్ బాగుందని చాలా మంది చెప్తున్నారు. సో.. మా పెయిర్ వర్కౌట్ అయింది కాబట్టి రిలీజ్‌కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టే.


డాన్స్‌లో నేను పూర్. కానీ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నాకు డాన్స్ చేసే సాంగ్స్ పడలేదు. కానీ ఫస్ట్ టైం ఇందులో ఒక మాస్ సాంగ్ చేశాను. చాలా కష్టపడి డాన్స్ చేశాను. ఆ సాంగ్‌ని థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్‌లో వస్తుంది. ఈ చిత్రంలో ‘కోల కళ్ళే ఇలా’ నా ఫేవరేట్ సాంగ్. బేసిక్‌గా సిద్ శ్రీరామ్ ఏం పాడినా నాకు నచ్చుతుంది. సో తన వాయిస్ కూడా సాంగ్‌కి ప్లస్ అయ్యింది. అలాగే ఆల్బమ్‌లో ‘మనసులోనే నిలిచిపోకే‘ అనే సాంగ్ కూడా బాగా ఇష్టం. చిత్రంలోని లవ్ స్టోరీ అందరికీ నచ్చేలా ఉంటుంది. రెగ్యులర్ గా అనిపించదు. ఓల్డ్ స్కూల్ రొమాన్స్ ఉంటుంది. మా డైరెక్టర్ చాలా అందంగా చూపించారు. ఈ సినిమా తర్వాత మా డైరెక్టర్‌కి మంచి పేరు వస్తుంది.


నదియాగారు ఇప్పటి వరకు కొన్ని పవర్ ఫుల్ రోల్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆమె చేయని ఓ ఇన్నోసెంట్ రోల్‌లో ఈ చిత్రంలో కనిపిస్తారు. నదియాగారి పాత్రకి అందరూ ఇంప్రెస్ అవుతారు. ఆవిడతో నటించడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సినిమా రిలీజ్‌కి ముందు ఎవరికైనా నెర్వస్‌నెస్ ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ ఈ ఫేజ్‌ని ఒక ఫెస్టివల్‌లా ఫీలవుతూ ఎంజాయ్ చేస్తున్నాను. రిలీజ్‌కి ముందే ఇండస్ట్రీ లో కూడా సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ విని సంతోషంగా ఉంది. సినిమాను పెద్ద స్కేల్‌లో చూపించినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో నమ్మకంగా నిర్మించారు. వారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.


నా పెళ్ళికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంకా రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు తప్ప ఆ విషయాన్ని నాకే వదిలేశారు. ‘పెళ్లి చూపులు’ తర్వాత మళ్ళీ అలాంటి రోల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ రాలేదు. మధ్యలో తమిళ్ లో కొన్ని సినిమాలు చేశాను కానీ అవి రిలీజ్ లేట్ అయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్‌తో తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్‌లో మరో సినిమాతో పాటు మరో వెబ్ సిరిస్ చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు..’’ అని తెలిపారు. 

Updated Date - 2021-10-27T02:43:17+05:30 IST