కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ. విభిన్నకథాంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగానే కాకుంగా దర్శకుడుగా, సంగీత దర్శకుడుగా కూడా రాణిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా తన దృష్టంతా కేవలం నటనపైనే కేంద్రీకరించారు. ప్రస్తుతం ‘మెట్రో’ చిత్రం దర్శకుడు ఆనంద్ కృష్ణన్ డైరెక్షన్లో ‘కొడియిల్ ఒరువన్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి గత ఏప్రిల్‌లోనే ఈ సినిమా విడుదలకావాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదాపడింది. ఇదిలాఉండగా ‘విడియుమ్ మున్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన బాలాజీ దర్శ కత్వంలో విజయ్ ఆంటోనీ నటించనున్నారు. అందులో ఆయన సరసన హీరోయిన్గా రితికా సింగ్ పేరును ఖరారు చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈమె హీరో మాధవన్ నటించిన ‘ఇరుదిచుట్రు’, అశోక్ సెల్వన్‌తో కలిసి ‘ఓ మై కడవుళే’ చిత్రాల్లో నటించి కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.