రితికా సింగ్ తడి దుస్తుల్లో.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-07-22T03:50:46+05:30 IST

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ‘గురు’తో టాలీవుడ్‌కి పరిచయమైన రితికా సింగ్, ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపును పొందింది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ అనుకున్నంతగా

రితికా సింగ్ తడి దుస్తుల్లో.. వీడియో వైరల్

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ‘గురు’తో టాలీవుడ్‌కి పరిచయమైన రితికా సింగ్, ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపును పొందింది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ అనుకున్నంతగా ఆమె అవకాశాలను పొందలేకపోయింది. బాక్సర్ అయినటువంటి ఈ భామ సినిమాల్లో అసలు రాణిస్తోందా? అని అనుకున్న వారికి తొలి చిత్రంతోనే సమాధానం చెప్పింది. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసింది కానీ.. అవి అంతగా ఆమెను నిలబెట్టలేకపోయాయి. దీనికి కారణం ఏమిటీ అనేది పక్కన పెడితే.. తాజాగా ఆమె హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టినట్లుగా.. గ్లామర్ టచ్ ఇచ్చేందుకు సిద్ధం అనేలా ఆమె ఫొటో షూట్స్ ఉండటం విశేషం. తాజాగా నీటి కొలనులో జరిగిన ఫొటోషూట్ అనంతరం ఆమె ఒడ్డుకు చేరుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తడి దుస్తుల్లో, పూలు పెట్టుకుంటూ కనిపించి నెటిజన్లను ఫిదా చేస్తోంది.

Updated Date - 2021-07-22T03:50:46+05:30 IST