Genelia: ఎనిమిది సార్లు కాళ్లు పట్టుకున్నాడు!

ABN , First Publish Date - 2021-08-03T20:46:43+05:30 IST

బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంటల్లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2012లో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారీ జంట. ఇద్దరూ సరదాగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటారు.

Genelia: ఎనిమిది సార్లు కాళ్లు పట్టుకున్నాడు!

బాలీవుడ్‌లో అన్యోన్యమైన జంటల్లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2012లో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారీ జంట. ఇద్దరూ సరదాగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటారు. ఇటీవల ఈ కపుల్‌ ఓ డాన్స్‌ రియాల్టీ షాదీ షోలో న్యాయనిర్ణేతలుగా పాల్గొని ఆకట్టుకున్నారు. డ్యాన్స్‌షోలో కంటెస్టెంట్ల ప్రతిభ చూశాక తమ పెళ్లిరోజు గుర్తొచిందని జెనీలియా చెప్పారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మా పెళ్లిరోజు రితేశ్‌ నా కాళ్లను 8 సార్లు పట్టుకున్నాడని జెనీలియా నవ్వుతూ చెప్పింది.  వెంటనే మైక్‌ అందుకున్న రితేశ్‌.. దానికి కారణం పెళ్లి తర్వాత ఏం చేయాలన్నది అక్కడున్న పంతులుకి ముందే తెలిసుంటుంది. అందుకే పెళ్లిరోజే ఆయన నాతో ప్రాక్టీస్‌ చేయించారని రితేశ్‌ చెప్పగానే షోలో నవ్వులు పూశాయి.  


Updated Date - 2021-08-03T20:46:43+05:30 IST