Kantara: సర్‌ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్

Twitter IconWatsapp IconFacebook Icon
Kantara: సర్‌ప్రైజ్.. ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్

‘కాంతార’  (Kantara) ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 23 అర్ధరాత్రి నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘కాంతార’ లోని వరహరూపం పాటపై కోర్టులో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అందువల్ల యూట్యూబ్ నుంచి ఆ పాటను నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్ తొలగించింది. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేం. కోర్టులో కేసు నడుస్తుండటంతో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా లేదా అని అభిమానులందరు ఎదురుచూశారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ‘‘ఎదురు చూపులకు తెరపడింది. ‘కాంతార’ రేపటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది’’ అని ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. 

      

‘కాంతార’ లో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించాడు. రిషబే దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీకి సంబంధించి కన్నడ నాట కోటి టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఐఏమ్‌డీబీలోను అత్యధిక రేటింగ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఐఏమ్‌డీబీ రేటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’ లను బీట్ చేసింది. ఈ చిత్రంపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశసంల వర్షం కురిపించారు. రజినీకాంత్, రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, పూజా హెగ్డే, శిల్పా శెట్టి తదితరులు ఈ మూవీని పొగిడారు.



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.