సుశాంత్‌తో కలిసి ఉన్న ఓ పాత వీడియోను పోస్ట్ చేసిన రియా చక్రవర్తి.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవీ..!

ABN , First Publish Date - 2022-01-21T21:04:56+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే

సుశాంత్‌తో కలిసి ఉన్న ఓ పాత వీడియోను పోస్ట్ చేసిన రియా చక్రవర్తి.. నెటిజన్ల రియాక్షన్స్ ఇవీ..!

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో డ్రగ్స్ కోణంపై ఆమెను పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపారు. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రియా ఒక పాత వీడియోని అభిమానులతో పంచుకుంది. ‘మిస్ యూ సో మచ్’ అంటూ కామెంట్ రాసింది.  జిమ్‌లో కెమెరాకు ఫోజులిస్తూ సుశాంత్, రియా ఆ వీడియోలో కనిపించారు. ఆ వీడియోను ఆమె పోస్ట్ చేయగానే నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. రియా స్నేహితులు, అభిమానులు ఆమెపై అభినందనల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. 


2020 జనవరి 14న తన సొంత అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పదరీతిలో మరణించారు. అయితే, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ సుశాంత్ మృతిపై అతడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. రియాపై ఎఫ్‌ఐ‌ఆర్‌ను దాఖలు చేశారు. దీంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రియా, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిపై ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో డ్రగ్స్ అనవాళ్లు కూడా బయటపడ్డాయి. అనంతరం ఈ కేసును కేంద్రప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.



Updated Date - 2022-01-21T21:04:56+05:30 IST