‘పవర్ ప్లే’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-03-06T01:38:16+05:30 IST

ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎంటట‌ర్‌టైన‌ర్‌ తర్వాత రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ కాంబినేష‌న్‌లో వస్తోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘’ప‌వ‌ర్ ప్లే. చాలా కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచుస్తున్న రాజ్‌త‌రుణ్ ఫ‌స్ట్ టైమ్ త‌న కంఫ‌ర్ట్‌జోన్..

‘పవర్ ప్లే’ మూవీ రివ్యూ

చిత్రం: ప‌వ‌ర్‌ ప్లే

నిడివి: 117 నిమిషాలు.

జోన‌ర్‌: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

న‌టీన‌టులు:  రాజ్‌త‌రుణ్‌, హేమ‌ల్ దేవ్‌, పూర్ణ‌, ప్రిన్స్‌, కోట శ్రీ‌నివాసరావు‌, అజ‌య్‌, మ‌ధునంద‌న్‌, ద‌న్‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్‌, టిల్లు వేణు, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, కేద‌రి శంక‌ర్, భూపాల్ త‌దిత‌రులు

ద‌ర్శ‌కుడు: విజ‌య్ కుమార్ కొండా

నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌

మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్ర‌ఫీ: ఐ ఆండ్రూ

ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి

ఆర్ట్‌: శివ‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాల‌మ‌ర్తి అనంత్ సాయి

బ్యాన‌ర్‌‌: వ‌న‌మాలి క్రియేష‌న్స్‌


ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎంటట‌ర్‌టైన‌ర్‌ తర్వాత రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ కాంబినేష‌న్‌లో వస్తోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘’ప‌వ‌ర్ ప్లే. చాలా కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచుస్తున్న రాజ్‌త‌రుణ్ ఫ‌స్ట్ టైమ్ త‌న కంఫ‌ర్ట్‌జోన్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి న‌టించిన ‘ప‌వ‌ర్ ప్లే’ చిత్రంతో హిట్ కొట్టాడా?  లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం. 


కథ:


విజ‌య్ కుమార్ కొండా(రాజ్ త‌రుణ్‌) చ‌దువు పూర్తిచేసి  సివిల్స్‌కోసం ప్రిపేర్ అవుతుంటాడు. కీర్తి (హేమ‌ల్ దేవ్‌) అత‌డి గ‌ర్ల్ ఫ్రెండ్‌. వాళ్లింట్లో వాళ్ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ద‌మవుతారు. త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌తో క‌లిసి ఒక ప‌బ్‌లో పార్టీ చేసుకోవ‌డానికి  ఏటిమ్ నుండి క్యాష్ డ్రా చేసుకుని వెళ్తాడు విజ‌య్‌. ఆ నోట్లు దొంగ నోట్లు కావ‌డంతో పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేస్తారు. ఆ కేసు వల్ల ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో పెళ్లి కాన్సల్ అవుతుంది. విజయ్ లైఫ్ రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఎలా అయినా తను నిర్ధోషిని అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ ఎటిఎం సిసీటీవి ఫుటేజ్ ఇవ్వాల్సిందిగా బ్యాంక్ మేనేజ‌ర్ ర‌వివ‌ర్మ‌ను అడుగుతాడు. అత‌ను నిరాక‌రిస్తాడు. దాంతో ఆ ప్ర‌క్క‌నే ఉన్న ఒక మెకానిక్ షాప్ లో అత‌డు డబ్బు డ్రా చేయ‌డానికి కొద్ది సేప‌టి ముందే ఒక మ‌ర్డ‌ర్ చేయ‌డం రికార్డ్ అవుతుంది. ఆ  ఫుటేజ్ చూపించి ఆ షాప్ ఓనర్, కాబోయే సీఎం పూర్ణని ఎందుకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతాడు.?  ఎటిఎంలలో దొంగనోట్లు పెడుతున్న ముఠా ఎవరు? అస‌లు విజయ్ నిర్దోషిగా నిరూపించుకోగలిగాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


ఒక ర‌చ‌యిత రెండు క్రైమ్ పాయింట్స్‌ని కలుపుతూ ఒక కథ రాసుకునేట‌ప్పుడు ఆడియ‌న్స్ క‌న్‌ఫ్యూజ్ అవ‌కుండా జాగ్ర‌త్తలు తీసుకోవాలి లేకుంటే ఏ స‌న్నివేశం ఎందుకు వ‌స్తుంది అన్న‌ది స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అర్ధం కాదు. ఈ క‌థ‌లో కూడా అదే త‌ప్పు జ‌రిగింది. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి థ్రిల్ల‌ర్ సినిమాల‌కి క‌థ, క‌థ‌నం క‌న్నా నెక్ట్స్ ఏం జ‌ర‌గ‌బోతుంది అని  థ్రిల్ మెయింటేన్ చేయ‌డం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాలో అలా ప్రేక్ష‌కుల్ని  కట్టిపడేసే ఒక్క బ‌ల‌మైన స‌న్నివేశం కూడా లేక‌పోవ‌డంతో సినిమా అంతా బోరింగ్‌గా సాగుతుంది. రాబోయే స‌న్నివేశాలను స‌గ‌టు ప్రేక్ష‌కుడు ముందుగానే ఊహించ‌గ‌ల‌గ‌డం ఈ సినిమాకి ఉన్న అతి పెద్ద  మైన‌స్ పాయింట్‌. ఇప్పటి వరకూ కేవ‌లం ప్రేమ కథలని డీల్ చేసిన‌ విజయ్ కుమార్ కొండా కొత్త జోన‌ర్‌లో స‌క్సెస్ కాలేక‌పోయాడ‌నే చెప్పొచ్చు. క‌థ క‌థ‌నం బ‌లంగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఐ ఆండ్రూ విజువల్స్ కూడా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక పొయాయి. అయితే సురేష్ బొబ్బిలి నేపేథ్య సంగీతం మాత్రం ఇది ఒక థ్రిల్ల‌ర్ మూవీ అని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి నిడివి 117 నిమిషాలే ఉండేలా షార్ట్ గానే కట్ చేశాడు కాని బ‌య‌టికొచ్చే ప్రేక్ష‌కుడు మాత్రం మూడు గంట‌ల సేపూ సినిమా చూసిన అనుభూతిని పొందుతాడు. వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ సోసోగా ఉన్నాయి. 


చివ‌రిగా: ‘పవర్ ప్లే’ –  ప‌వ‌ర్ లేని ప్లే



సమీక్ష: 

ఇప్పటివరకూ ల‌వ‌ర్‌బోయ్‌గా కనిపించిన రాజ్ తరుణ్ మొదటి సారి థ్రిల్లర్ సినిమాలో కనిపించాడు. టెన్షన్, బాధ, కోపం, అస‌హ‌నం ఇలా అన్నీ కలగలిపిన పాత్రలో ప‌ర్వాలేద‌నిపించేలా న‌టించాడు. హీరోయిన్ పాత్ర‌కి అంత ప్రాముఖ్య‌త లేదు. కేవ‌లం రొమాంటిక్ స‌న్నివేశాల వ‌ర‌కే వ‌చ్చివెళ్తుంది ఆ పాత్ర అయితే హేమల్ ఇంగ్లే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ముఖ్యమంత్రిగా కోట శ్రీ‌నివాస‌రావు స్క్రీన్ మీద క‌నిపించినంత సేపూ ఓకే అనిపించారు. అత‌ని కూతురిగా, కాబోయే ముఖ్య‌మంత్రిగా పూర్ణ కి మంచి పాత్ర ద‌క్కింది. కొన్ని స‌న్నివేశాల్లో ప‌వ‌ర్‌ఫుల్‌గా న‌టించింది.  ముఖ్య పాత్రలు పోషించిన మ‌ధునంద‌న్‌, అజయ్, రాజా రవీంద్ర, రవి వర్మ, ధన్ రాజ్, టిల్లు పాత్ర‌లు చెప్పుకోద‌గిన‌వి కాదు. 

Updated Date - 2021-03-06T01:38:16+05:30 IST