Nikhil : ఆ సినిమాకి రిపేర్లు మొదలెట్టారట !

ABN , First Publish Date - 2022-09-15T20:38:36+05:30 IST

ఇటీవల ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో మామూలు హిట్టు కొట్టలేదు నిఖిల్‌ (Nikhil). ఒక్క తెలుగులో హిట్టైతే చాలనుకుని బాలీవుడ్ వెర్షన్‌ను లైట్ తీసుకున్న నిర్మాతలకు గట్టి షాకిస్తూ బాలీవుడ్‌లోనూ దుమ్మురేపేసింది.

Nikhil : ఆ సినిమాకి రిపేర్లు మొదలెట్టారట !

ఇటీవల ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో మామూలు హిట్టు కొట్టలేదు నిఖిల్‌ (Nikhil). ఒక్క తెలుగులో హిట్టైతే చాలనుకుని బాలీవుడ్ వెర్షన్‌ను లైట్ తీసుకున్న నిర్మాతలకు గట్టి షాకిస్తూ బాలీవుడ్‌లోనూ దుమ్మురేపేసింది. అది ఎంతలా అంటే.. మొదటి భాగం ‘కార్తికేయ’ (Karthikeya) లో కథకు ప్రారంభం ఏమైనా ఉందేమో అనుకొని యూట్యూబ్‌‌లోని దాని డబ్బింగ్ వెర్షన్ ‘ఏక్ అజీబ్ దాస్తాన్ శాపిత్’ (Ek Ajeeb Dastan Shaapit ) ను తెగ చూసేస్తున్నారు బాలీవుడ్ జనం. ఆరునెలల క్రితం పెడితే ఇప్పుడది 8 మిలియన్ వ్యూస్‌‌కు చేరువలోకి వచ్చేసింది. ఇప్పుడు దీని సూపర్ హిట్ ఎఫెక్ట్ నిఖిల్ నెక్స్ట్ మూవీ ‘18 పేజెస్‌ (18 pages) పై’ ఓ రేంజ్‌లో పడింది. 


సుకుమార్ (Sukumar) రచనలో గీతాఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21 F) ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి (Suryaprathap Palnati) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులోనూ అనుపమా పరమేశ్వరనే (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు ‘18 పేజెస్’ సినిమాలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో కొంత భాగాన్ని కీలక మార్పులు చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఎప్పుడో పూర్తయిన ఫైనల్ కట్ ను సుకుమార్ కు చూపిస్తే .. ఆయన పెదవి విరిచారట. దాంతో అవసరమైన మేరకు రీషూట్ చేయడానికి నిఖిల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. 


ఇప్పుడు ‘కార్తికేయ 2’ సక్సెస్‌ను నిలబెట్టుకోవడం నిఖిల్‌కు ఎంతో అవసరం.  ఇప్పటిదాకా ‘18 పేజెస్’ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.  కనీసం ట్రైలర్ ఎప్పుడొస్తుందో అనే దానిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. నిఖిల్ సైతం ఇటీవల విడుదలైన ‘కార్తికేయ 2’ చిత్రం గురించే మాట్లాడుతున్నాడు కానీ, తాజా చిత్రం ‘18 పేజెస్’ పై ఎక్కడా పెదవి విప్పడం లేదు. ఒకవేళ రీషూట్స్ చేస్తున్న విషయమే నిజమైతే.. ‘18 పేజెస్’ చిత్రం ఇప్పుడప్పుడే విడుదలవదని ఖాయంగా చెప్పొచ్చు. అసలే బన్నీ వాసు (Bunny Vas) నిర్మాణంలోని చిత్రాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. అందుకే ‘18 పేజెస్’ చిత్రం విషయంలో జాగ్రత్తలు పడుతున్నారని అర్ధమవుతోంది.

Updated Date - 2022-09-15T20:38:36+05:30 IST