టెలివిజన్ ప్రసారానికి సిద్ధమైన సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’

ABN , First Publish Date - 2022-01-19T22:06:39+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, న్యాయవ్యవస్థ అనేవి మూడు గుర్రాల వంటివి. ఈ మూడు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా రాజకీయ వ్యవస్థ చాలా బలవంతమైన వ్యవస్థగా మారి..

టెలివిజన్ ప్రసారానికి సిద్ధమైన సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’

ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్స్, న్యాయవ్యవస్థ అనేవి మూడు గుర్రాల వంటివి. ఈ మూడు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా రాజకీయ వ్యవస్థ చాలా బలవంతమైన వ్యవస్థగా మారి.. మిగిలిన రెండు వ్యవస్థలను కంట్రోల్ చేస్తే ప్రజాస్వామ్యం ఎలా చిన్నాభిన్నమవుతుందో.. ‘రిపబ్లిక్’ చిత్రం ద్వారా తెలియజెప్పారు దర్శకుడు దేవ కట్టా. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో.. ఆ తర్వాత ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. ఈ చిత్రం జీ తెలుగు ఛానల్‌లో జనవరి 23 సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.


ఈ సందర్భంగా దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ.. ‘‘ఈ ఆదివారం, జనవరి 23 సాయంత్రం 6 గంటలకు ‘రిపబ్లిక్’ చిత్రం టెలివిజన్ ద్వారా మిమ్మల్ని పలకరించబోతోంది. ఈ సినిమాని ప్రేక్షకులందరూ ప్రబలంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. వ్యవస్థ మీద మనందరి మనసులో ఉన్న మనోభావాలని ప్రతిబింబిస్తూ.. నిజాన్ని నిర్భయంగా ఎలుగెత్తిన సినిమాగా ‘రిపబ్లిక్’ ఇప్పటికే ఎంతో మందిని ఒక ఉద్యమంలా ప్రభావితం చేసింది. నిజం ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తుంది.. ఆ క్షణంలో స్థంబింపచేస్తుంది.. చివరికి మన ఆలోచనలో భాగమై, బలమై ముందుకు నడిపిస్తుంది. ఆ బలమే ఈ ‘రిపబ్లిక్’ చిత్రం’’ అని తెలిపారు. కాగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రాన్ని జీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.  


‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Updated Date - 2022-01-19T22:06:39+05:30 IST