రెజీనా ‘బ్రేకింగ్ న్యూస్ ’ ఏమిటంటే...
ABN , First Publish Date - 2021-11-24T05:42:59+05:30 IST
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో...

రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘సోషల్ సెటైరికల్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులను వాస్తవిక కోణంలో, ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో దర్శకుడు చూపిస్తున్నారు. డిసెంబర్ మూడో వారం వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది’ అని తెలిపారు. ఝాన్సీ, సురేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: బి.విఎస్.రవి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఫొటోగ్రఫీ: ఈశ్వర్ ఎలుమహంటి, ఎడిటర్: వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కౌముది నేమని, నిర్మాణం: రా ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా.