ఆకట్టుకుంటోన్న Regina, Anupamaల ‘మరీచిక’ కాన్సెప్ట్ పోస్టర్
ABN , First Publish Date - 2022-07-14T22:21:48+05:30 IST
అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా కసాండ్ర (Regina Cassandra), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘మరీచిక’ అనే టైటిల్‌ను

అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా కసాండ్ర (Regina Cassandra), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘మరీచిక’ (Mareechika) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సతీష్ కాశెట్టి (Satish Kasetty) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ‘మరీచిక’ అంటే ‘కళ్లను కనికట్టు చేసే భ్రమ’ అనేది అర్థంగా మేకర్స్ తెలుపుతున్నారు. వన్ మోర్ హీరో బ్యానర్‌పై రాజీవ్ చిలక (Rajiv Chilaka) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల (Lakshmi Bhupala) ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలను అందించడంతో పాటు లక్ష్మీ భూపాల ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. గురువారం ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ కాన్సెప్ట్ పోస్టర్‌ను గమనిస్తే.. ఇందులో కేవలం పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పాదాల ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడలాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్రతీకారం’ అనేది క్యాప్షన్. ఈ పోస్టర్.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆసక్తిని మరింతగా పెంచింది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అరవింద్ కన్నాభిరాన్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత రాజీవ్ చిలక విషయానికి వస్తే.. 20 ఏళ్ల పాటు యానిమేషన్ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ‘ఛోటా భీమ్’ రూపకల్పనతో క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఇప్పుడు వన్ మోర్ హీరో అనే బ్యానర్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘మరీచిక’కు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని, జూలై 26 నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత రాజీవ్ చిలక పేర్కొన్నారు.
