కోలుకున్న కైకాల

ABN , First Publish Date - 2022-01-21T10:00:58+05:30 IST

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన పూర్తిగా కోలుకున్నారు...

కోలుకున్న  కైకాల

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చారు.  అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా ఉన్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు అమూల్యమైన సహాయం అందించినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కైకాల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు జగన్‌కు ఓ లేఖ కూడా రాశారు.


Updated Date - 2022-01-21T10:00:58+05:30 IST